పుట:SamskrutaNayamulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
77

సంస్కృతన్యాయములు

మధురరసభవితామ్రబీజన్యాయము :

మామిడిటెంక అంతకంతకూ ఎక్కువ తీయనిపండ్లు గలిగించుచునేయుండును.

ఉత్తరోత్తర ముత్తమోత్తమఫలితములు కనఁబడునపు డీన్యాయ ముపయోగింపఁబడును.


మధ్యదీపన్యాయము :

ఇంటిమధ్య నున్న దీపము ఇంట నన్నిమూలల వెలుతు రిచ్చునట్లు.


మధ్యమమణిన్యాయము :

ముత్యాలహారములో కొలికిపూసగా నుంచఁబడిన మణి తాను ప్రకాశించుచు తనప్రభచే ముత్యములనుగూడ ప్రకాశింపఁజేయును.

సంఘమునఁ దాను ప్రకాశించుచు సజ్జనుఁడు తోడివారలకుఁ గూడ తేజు నిచ్చును.


మనోరాజ్యవిజృంభణన్యాయము :

కోరికలకు అంతు లేదు. ఒకదానిపై నొకటి పుట్టుచునే యుండును.


మన్దవిషన్యాయము :

కొద్దివిషమువలె.

కొద్దిపాటివిషయము నణచివైచుట సుకరము.