పుట:SamskrutaNayamulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
75

సంస్కృతన్యాయములు

ఒకయింటిలో నొకచో దీపము బెట్టిరి. దానిప్రభ మణివలెఁ బ్రకాశించుచు గుమ్మములోఁ బడుచుండెను. ఆ ఎదుటి యింటిలోఁ బైదీపమున కెదురుగ నొక మణి యుంచఁబడెను. దానిప్రభయు మణివలె గుమ్మమునఁ బడుచుండెను. వానినిఁజూచి యొకఁడు దీపప్రభయే మణియను భ్రాన్తితో దీపప్రభ యొద్దకుఁ బరుగెత్తెను. మఱొకఁడు మణియను భ్రాన్తితో మణిప్రభవద్దకుఁ బరుగెత్తెను. వారిరువురును ప్రభాద్వయమును జేరి పరిశీలించి యివిమణులు కావనియు, మణిదీపప్రభ లనియు, తా మూరక భ్రమించి అట్లు పరుగిడితిమనియు, తెలిసికొనిరి. దీపప్రభను మణి అనుకొనినవానిది విసంవాది భ్రమ; మణిప్రభను మణి అనుకొనినవానిది సంవాదిభ్రమ అని చెప్పఁబడును.


మణిప్రదీపప్రభాన్యాయము :

మణిప్రభామణిమతిన్యాయము, నియ్యదియు నొకటియే.


మణిమంత్రన్యాయము :

అగ్నిజ్వాలల నార్పుటకు మణులు, మంత్రములు పనికిరావు.

విషయకాములకు జ్ఞానోపదేశము, మ్రియమాణునకు మందుమాకులు వలె.


మణిసూత్రన్యాయము :

పూసలలోఁ దారమువలె

(అందఱతోఁ గలసిమెలసి యుండుట).