పుట:SamskrutaNayamulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
61

సంస్కృతన్యాయములు

వను తుపాకితోఁ గాల్చి చంపి తన ఒంటెను రక్షించుకొనెను.

  • వానిలో రెండుఁ జంపఁదగనివే; రెండుఁ జావఁదగినవే. నోటిముంగలి సిద్ధాన్నమును దీసివేయుటయుఁ బాపమే. అయినను స్వార్థరక్షణమున మానవుని పాపాపాపములు బాధించవు.
బిడాలవిణ్మోచనన్యాయము
  • పిల్లి మలవిసర్జనము చేయునపుడు గొయ్యి త్రవ్వి యందు విడిచి పూడ్చివేయును.
బిలవర్తిగోధాన్యాయము
  • కన్నములో దూరిన బల్లి మొదలగువానిని చంప వీలు గానట్లు.
  • దీనికి 'బిలగోధాన్యాయ' మనియుఁ జేరు కలదు.
బిల్వఖల్వాటన్యాయము
  • ఎండవేడిమికి నిలువఁజాలక బట్టతలవాఁ డొకఁడు ప్రాంత ముననున్న మారేడుచెట్టునీడకు పోయెను. దైవవశమున మారేడుపం డూడిపడి వానితల పగిలెనఁట.
  • "దరిద్రునిపెళ్ళికి వడగండ్లవాన" అన్నట్లు.
  • (దీనినే "ఖర్వాటబిల్వన్యాయ" మందురు.)