పుట:SamskrutaNayamulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

సంస్కృతన్యాయములు

చిల్లులద్వారా అన్నిరకములుగఁ బైకి ప్రసరించి వెలుప ల ఆవెలుతురంతయు నేక మవును.

  • "నానాఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరమ్‌"
                                            (దక్షిణామూర్తిస్తవము.)
బహుభ్యఃశ్రోతవ్యబహుధాన్యాయము
  • పలువురు పలుతెఱంగులు నుడువుదురు.
  • ఒకనియందే లక్ష్య ముంచుట లెస్స.
బహురాజపురన్యాయము
  • పలువురురాజులు పాలకులుగాఁ గల పట్టణమువలె. వారిలో వారికి మాట కలియక తుద కాపట్టణము ధ్వంసమవును. *అట్లే బహునాయకత్వము నాశకారణము.
బహువృకాకృష్టమృగన్యాయము
  • తోడేళ్ళగుంపుమధ్యఁ జిక్కిన లేడివలె. (దేనికి దొఱికిన భాగమా తోడేలు కొఱికివేయును)
బహుసపత్నీకన్యాయము
  • అనేకమంది భార్యలు గలవాని బ్రదుకువలె.
బాణోష్ట్రీన్యాయము
  • కొండచిలువ యొకయొంటెను పట్టి చంపు ప్రయత్నములో నుండెను. అది చూచి ఒంటె యజమాని కొండచిలు