పుట:SamskrutaNayamulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
62

సంస్కృతన్యాయములు

బిల్వవిభజనన్యాయము
  • మారేడుపండును పగులగొట్టినట్లు.
  • (తెలియని విషయమునఁ బ్రవర్తించుట.)
బీజవృక్షన్యాయము
  • బీజమున వృక్షము, వృక్షమున బీజము ఇమిడియున్నట్లు.
బీజాంకురన్యాయము
  • "యథా బీజ స్తథాంకురః" గింజనుబట్టి మొలక.
  • విత్తు ముందా,చెట్టు ముందా యనునట్లు.
  • చెట్టులో విత్తును, విత్తులో చెట్టు నుండును.
                                     భాగవతము.

బ్రాహ్మణగ్రామన్యాయము

"ఇది బ్రాహ్మణ ఊరు" అని మనము సాధారణముగ ననుచుందుము. అనగా కేవల మీయారు బ్రాహ్మణ లదే అని కాదు. తక్కినాన్నివర్ణములకంటె నీయూర బ్రాహ్మణు లెక్కువగ నున్నారని భావము. ఆమ్రవణమువలె.

బ్రాహ్మణపరివ్రాజకన్యాయము

బ్రాహ్మణులకు భోజనము పెట్టవలె ననిన బ్రాహ్మణులే యవుట బరివ్రాజకులకుగూడ భోజనమే పెట్టవలె నని కాదు.