పుట:SamskrutaNayamulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51

సంస్కృతన్యాయములు

పర్జన్యన్యాయము
  • మేఘుడు మంచినేలను చవిటినేలనుగూడ వర్షించును. మంచినేలను గురిసినది ఫలించును. చవిటి నేలను గురిసినది వ్యర్థమగును. ఆ లాభాలాభములతో మేఘమునకు సంబంధము లేదు. కురియుట దానిస్వభావము.
పర్వతాధిత్యకాన్యాయము
  • అధిత్యకా అనిన పర్వతోపరిభాగము అని అర్థము. అటులయ్యు "పర్వతాధిక్యత" యందురు. అపుడును మొత్తమునకు పర్వతోపరిభాగము అనియే అర్థము. అట్టిప్రయోగమున ఆదిత్యకాశబ్దము ఉపరిభాగము అని మత్రమే అర్ధమును స్పురింపజేయును.

(కరకంకణము, నీలేందీవరము చంద్రునివెన్నెల వలె.) సర్వతోసత్యన్యాయము ఉపత్యకా అనిన కొండయెక్క అడుగుభాగము. (తక్కిన దంతయు బూర్వన్యాయమువలె.) ఫలితాఫలితకేశన్యాయము ఒకనితల నెరిసీనెరియనట్లుండెను. వాని కిరువురు భార్యలు, ఒకతె వయసుది, మరొకతె వయసుమీరినది. వయసుది తెల్లవెండ్రుకలను, రెండవది నల్లవెండ్రుకలను లాగివైచి వానిని బోడినిజేసిరట. భిన్నభిన్నధర్మములుగల పదార్ధము లనేకము లొగచో నిముడనేరవు.