పుట:SamskrutaNayamulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

సంస్కృతన్యాయములు

పవనతడనన్యాయము
  • గాలిని కొట్టినట్లు.

(ఆకాశముష్టిహననమునలె.)

పశుసోమాధికరణన్యాయము
  • సోమయాగమున బశువును విధించినట్లు.
పక్షికులాయన్యాయము
  • పిల్లలు పెద్దవయినంతన పక్షి గూడు వదలిపెట్టును.

అవసరము తీరిననెనుక ఆశృయ మనవసరము.

పాటచ్చరయామికన్యాయము
  • దొంగలు దోచుకొనిపోయినతరువాత కావలివారు మేల్కొని హడావిడిపడినట్లు.
పాత్రేసమ్మితన్యాయము
  • భోజనసమయమునకు సిద్ధముగ నుండువా రేపనికి నుపయోగించరు.
  • 'తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు' అనినట్లు.
పారిషదన్యాయము
  • సభలో పనిచేయువా డొకడే. కాని, ఆపనిని సభలోని వారందఱు చేసినట్లు తలంతురు.
పాషాణేష్టకాన్యాయము
  • ఇటుకఱాయి చట్రాతికన్న మృదువైనదే.