పుట:SamskrutaNayamulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

సంస్కృతన్యాయములు

ప్రక్కలకు వక్రగమన ముండదు. కాని, చంపునపుడు మాత్ర మైమూలగా వక్రగతి పట్టును. (దుష్టుడు దౌష్ట్యమునకు దిగక నడచుచూ, సాధువువలె గన్పించినను, తలవనితలంపుగ దుర్మాగ్గమునకు దిగును).

పద్మినీపత్రజలబిందున్యాయము
  • తామరాకులోని నీరు ఆకు నంటియుండదు.
పయెముఖవిషకుంభన్యాయము
  • లోపల విషము, పైని పాలును గల కుండవలె.
పరాహ్ణచ్చాయాన్యాయము
  • మధ్యాహ్నముతరువాత నీడ మొదట కొందెముకొంచెముగానుండి క్రమక్రమముగ దీర్ఘ మగును.

(కోడికూతవలె).

పరిణామిన్యాయము
  • కాలమునుబట్టి ప్రతివస్తువునకు మార్పు కలుగుచుండును.
పరిశేషన్యాయము
  • రెండుసంఖ్యలు గలిసిన మొత్తములో నొకసంఖ్య చెప్పినచో తక్కినసంఖ్య చెప్పనక్కఱ లేకయే తెలియును.

(' స్త్రీలును బురుషులును గలిసి పదిమంది. అందు బురుషులు నలుగురు' అనిన మిగిలినయాఱుగురు స్త్రీలని చెప్పవలయునా?)