పుట:SamskrutaNayamulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23

సంస్కృతన్యాయములు

పాకకడకు వచ్చుసరికి తెల్లవారెను. అతని కాయాస పడుటయు, సుంక మీయకుండ తప్పించుకొనలేకుండు టయుఁగూడ సంభవించెను. కళా. 6.248. చంద్రికా. 4.107. నైష. 4.75.

ఘరట్టన్యాయము

తిరుగలిదిమ్మలలో నొకటి తిరుగునది, ఒకటి తిరుగనిదియు. రెండు నుండు టవసరమే. కేవల మొక తిరుగుదానితోనే లేక తిరుగనిదానితోనే పని నెఱవేఱదు.

ఘుణాక్షరన్యాయము

ఒకపురుగు ఒకకఱ్ఱను దొలువఁగాఁ దొలువఁగా నది యొకానొకప్పుడు అక్షరాకారముగ నేర్పడవచ్చును. అది యప్రయత్నముగ నేర్పడినదికాని పురుగుయొక్క ప్రయత్నముచేఁ గాదనుట. విక్ర. 1.17.

ఘృతకోశాతకీన్యాయము

నేతిబీరకాయ యని పేరేగాని యందు నేయి యుండదు సరికదా చప్పగగూడ నుండును. పాండు. 2.13. (ఇంటిపేరు కస్తూరివారు; ఇంటిలో గబ్బిలాలకంపు.)

ఘోటకబ్రహ్మచర్యన్యాయము

సాధారణముగ గుఱ్ఱములను యజమానులు ఆడుగుఱ్ఱములతోఁ గలియనీయరు. పైపెచ్చు వాని అవయవములను