పుట:SamskrutaNayamulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

సంస్కృతన్యాయములు

గోముఖవ్యాఘ్రన్యాయము

ఆవుముఖముగల పులిని ఆవు అనుకొని యితరమృగములు చెంతకురాఁగా పులి వానిని మ్రింగివేయును. కళా. 6.267.

గోవత్సన్యాయము

ఆవు నమ్మినపుడు దూడకు వేఱే వెల లేదు.

గోక్షీరన్యాయము

గేదెపాలైనను ఆవుపాలు కొంచెము కలిసినచో పవిత్రమగును.

గ్రామదూరన్యాయము

ఈయూరి కాయూరు ఎంత దూరమో ఆయూరి కీయూరు నంతే దూరము.

ఘటీయంత్రన్యాయము

ఏతము తనపని యగునంతవఱకును వంగియుండి కాఁగానే మీఁదికి నిక్కును.

ఘట్టకుటీప్రభాతన్యాయము

ఒకవర్తకుఁ డొకపట్టణము చేరి తనవ్యవహారము చేసికొని పోవునప్పుడు ఆపట్టణములో ఘాటీపాకదగ్గఱనుండి పోయినచో సుంక మీయవలసివచ్చునని యర్ధరాత్రివేళ మాఱుత్రోవను బోవలయు నను తలంపుతో నాపట్టణములోని సందు గొందులు తిరిగి త్రోవగానక తుదకు ఘాటీ