పుట:SamskrutaNayamulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

సంస్కృతన్యాయములు

త్రాటితో బిగించియుంతురు. కాని అవి తఱచుగ తమ అవయవములను వ్రేలవైచియే యుండును. ప్రమాదవశమున త్రాడు త్రెంపుకొని యీవలఁబడినచో నవి ఆడుగాడిదలనుకూడ రూపులేకుండ చేయును. అట్టిది ఈబ్రహ్మచర్యము.

చండాలబ్రాహ్మణన్యాయము

స్వధర్మభ్రష్టుడయిన బ్రాహ్మణుడు చండాలునితో సమానుఁ డగును. కాని చండాలుడుమాత్రము కాఁడు. చండాలుఁ డెట్టి స్థితియందును బ్రాహ్మణుఁడు కాడు; బ్రాహ్మణ సమానుఁడు కాఁడు.

చంద్రచకోరన్యాయము

చంద్రునిరాఁకకు చకోరాలు వేచియున్నట్లు.

చంద్రచంద్రికాన్యాయము

చంద్రునితో బాటు వెన్నెల. అవినాభావసంబంధము.

చక్రభ్రమీన్యాయము

చక్రము తిరుగుచున్నప్పుడు మీదియంచు క్రిందికి, క్రింది యంచు మీదికి వచ్చుచుండును.

చక్షుశ్శ్రవణన్యాయము

పామునకు వినుచున్నపుడు చూచుటయు, చూచుచున్నపుడు వినుటయు నుండదు.