పుట:SamskrutaNayamulu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
325

సంస్కృతన్యాయములు

ప్రత్యక్షే చ యాగవిధా వానుమానిఅక్విధికల్పనానుపపన్నా ప్రత్యక్షమైన యాగవిధియందు అనుమానసాధితమైన విధి కల్పన మసంగతము.

"ప్రత్యక్షే కి మనుమానేన? అనునదియు నియ్యదియు నొకటియే.

ప్రధంగ్రానే మక్షికాపాత:

మొదటిముద్దలోనే ఈద పడినట్లు.

పని ప్ర్రారంబించగానే విఘ్నము కలుగుట అని న్యాయాశయము.

"వేసినదే ఓకడుగు; విఱిగినదే కాలు" అని తెనుగు సామెత.

ప్రదీపవత్

ఇంటిలో నొక చోటనున్న దీపము ఇల్లంతయు ప్రకాశింపజేయును.

ప్రదీపన్యాయమును జూడుము.

ప్రదీపే ప్రదీపం వ్రజ్యాల్య తమోనశాయ యతమాన:

పెద్దదీపమునుండి మఱొక దీపమును వెలిగించి ఇంటిలోని చీకటి పోగొట్ట యతించువానివిధమున.

చేతనున్న సులభోపాయముచేతనే సాధ్యసిద్ధి కలుగుచుండ అశాక్యమైన గురూపాయమున ప్రవర్తించువాని విషయమున నీన్యాయము ప్రవర్తించును.