పుట:SamskrutaNayamulu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
326

సంస్కృతన్యాయములు

ప్రధానా? ప్రధానయో: ప్రధానే కార్యసంప్రత్యయ:

ముఖ్యా ముఖ్యములలో ముఖ్యమే ప్రధానము.

ప్రమాణవత్త్వా వాయాత: ప్రహాహ: కేన వార్యతే:

సప్రమాణముగ ప్రవర్తించు ప్రవాహము ఎవనిచే నిరొదింపబడు;ను?

శ్రుతిప్రమాణమూమూలతొ సుబద్ధమై అవిచ్చిన్నముగ నెల్లఱచే నంగీకరిమప్బదిన జగన్మిధ్యాత్వ మెవనిచే గాదని త్రోసివేయబడగలదు?

ప్రమాణవ న్త్యదృస్థాని కత్వ్యాని సుబహు న్యపి

అక్షిగోచరములు కాకపోయినను ప్రమాణవంశము లవునెడ నెన్నియైనను నిజముగ కల్పించుకొనవలయును.

అట్లే--అడ్రు;ష్టశతభాగమే యైనను అప్రమాణమైనది కల్పించుకొన జనదు.

శ్రుతిప్రమాణములు గల యాశము లన్నియు విశ్వసనీయములు; శ్రుప్రమాణదూరము లవిశ్వసనీయములు.

ప్రయోజన మసుద్దిశ్యన మన్ధో పి ప్రవర్తతే

ఏదో యొక ప్రయొజనము చూచుకొనక మూర్ఖుడైనను దేనియందును ప్రఫర్తింపడు.

స్వార్ధము లేనిదే ప్రజాపతి సయితము సృష్టికార్యమునకు గడంగడు. (ప్రజాపతిత్వప్రాస్తియే అం దాతనికి గల ప్రయోజనము.)