పుట:SamskrutaNayamulu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
319

సంస్కృతన్యాయములు

పశ్య స్యద్రౌ జ్వలదగ్నిం నపున: పాదయో రధ:

కొండమీద మండుచున్న అగ్నినె చూచుదున్నవుగాని నీకాలిక్రింద మండుచున్న అగ్నిని గమనించుటలేదు. ఇతరులకు బుద్ధి చెప్పుచున్నావు గాని నీకు నీవు బుద్ధి చెప్పుకొనుటలేదు.

ఇతరులకు నీతులు బోధించి మంచిత్రోవన నడుప ప్రయత్నించువారు కారు పూరుషులన: తమకు తాము నీతులుపదేశించుకొని తమ మనసు సరియైనత్రోవన నడుపజూచువారే పూరుషులు.

పాటచ్చరలుంఠితే వేశ్మని యామిరజాగరణం

దొంగ లిల్లు దోదుకొని పోయినపిమ్మట కవలివాదు మేలుకొనినట్లు.

ల్ప్రయోజనములేని సమయమున స్వరూపతో వస్థితి "పాటచ్చరలుంకతే వేశ్మని యామికజాగరణ" మ్మనున ట్లుండును.

పాటన మస్తరేణ విషప్రణానాం వోప శాన్రి:

విషపువ్రణములు శస్త్రచికిత్స చేయనిదే శాంతింపవు. దుష్కరమైన తప:క్రియ లేనిదే దు:ఖప్రదమైన పాపముపశమింపదు.

పాత్రా పాత్రవిచారస్తు దేనుపన్నగయో రివ

ఆవు పాములలోవలె పాత్రాపాత్రవిచారము చేయవలెను (దానాదిసమయమందు.)