పుట:SamskrutaNayamulu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
318

సంస్కృతన్యాయములు

"......ప్రకారా న్తరస్థితి:----న ప్రకాకాన్తరస్య తాభ్యా మన్యస్య ప్రకారస్య స్థితి కిన్తు తదన్యతరస్యేత్యర్ధ" అని పైన్యాయవ్యాఖ్య.

పరస్పరపర్తిప్పర్ధినో రన్యతరనిషేధే న్యతరవ్యవష్తా

పరస్పరవిదుద్ధవాక్యములు రెంటియం దొకటి నిషిధమైనతదన్యతరవ్యవస్థ యయ్యెడగలుగును.

పై "పరస్పరవిరోధే హి నప్రకారాన్తరస్థితి" అను దానిం జూడుము.

పజన్ న్యవత్

మేఘమువలె.

పర్జస్య న్యాయమును జూడుము.

పలాలకూటస్య సాదృశ్యం కుంజరాదినా

వడ్లరాశికి ఏనుగుమున్నగువానితే సాదృశ్యముచెప్పినట్లు. దూరముననుండి చూచి--ఆవడ్లరాశి ఏనుగులాగాల్ ఉన్నది అని పోల్చిచెప్పి సమీపించిచూచిన తనపోలికను పోల్చంబడిన ధాన్యపురాశికిని నాదృశ్యమే లేక కుంజరసాదృశ్య మాభాసయగును.

అట్లే--దూరమున కొకటిగా కన్పడి యొకపోలికకు అవకాశమిచ్చుచు దగ్గఱకు వచ్చిన తదాభస ఘటించుతావుల నీన్యాయము మవతరించును.

దూరస్థవనస్పతి, దూరగిరి న్యాయములను జూడుము.