పుట:SamskrutaNayamulu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
310

సంస్కృతన్యాయములు

న హి స్వల్పో దోషో మితగుణదాధిక:

ఈషద్దోషము గుణబాహుల్యమును బాధింపదు.

"ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జ తీందో; కిరణేష్వినాంక:" కుమారసంబవము.

న హ్యస్ధస్యాజ్యావేక్షణోపేతే కర్మ ణ్యధికారొ స్తి

అజ్యహోమాదులతో గూదిన కర్మమున గ్రుడ్దివాని కధికారము లేదు.

చూడుము-- నహి పంగో ర్విష్ణు క్రమాద్యుపేతే కర్మణ్యధికార;.

న్ హ్యన్యస్య విరధధావే న్యస్య వైతధ్యం భవతి ఒకటి వ్యర్ధమైనపుడు మఱొకటియు వ్యర్ధముకాదు.

"న హి దేవత్తస్య శ్యామత్వే యజ్ఞదత్తప్యా పి శ్యామత్వం భవతి"

దేవదత్తుడు నల్ల్నివాడు అనిన యజ్ఞదత్తుడు సయితము నల్లనివాడే కావలయు నను నియమము లేదుకదా!

న హ్యప్రాప్య: ప్రదీప: ప్రకాస్యం ప్రకాశయతి

లభ్యమైన దీపము ప్రకాశ్యవస్తువును ప్రకాశింప జేయనేఱదు.