పుట:SamskrutaNayamulu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
309

సంస్కృతన్యాయములు

న హి సుఖప్రతీతి ర్వినా దు:ఖై: దు:ఖములు లేనిదే సుఖప్రతీతి కానేరదు.

న హి సుతీక్ష్ణాప్యసిధరా స్వయం చేత్తు మహిఅతవ్యాపారా చాల పదును గలదైనను కత్తిఅంచు తనను దాను ఖండింప నేఱదు.

చూడు;ము--- అంగుల్యగ్రం న తేనైవాంగుల్యగ్రేణ స్పృశ్యతే.

న హి సుశిక్షితోపి నటవటు: స్వస్కన్ధ మదిరోధుం పటు:

ఎంత కట్టు దిట్టముగ నేర్పినను నాట్యము నేర్చుకొను కుఱ్ఱవాడు తనబుజము తా నెక్కనేఱడు.

"న హి పటుతరో సి నటవటు: స్వస్కన్ధ మధిరుహ్యనరీనర్తి" అనియు, "న హి నటు శిక్షిత:సన్ స్వస్కంధ మదిరోక్ష్యతి" అనియు ననేకవిధముల నీన్యాయము గ్రంధాంతరములం దుపయోగింపబడి యున్నది.

న హి సోపానత్కే పాదే పునరపి సోపానహ ముపాదత్తే చెప్పులు తొడిగియున్న కాలికేమఱల చెప్పులు తొడగరు.

న హి ప్వతో పతీ శక్తి: కర్తు మన్యన శక్యతే

ఒకవస్తువునకు స్వభావికముగ తనవలన కలుగని యొక విష్టధర్మము, అన్యవస్తు సాధర్మ్యమువలన గూడ గలుగ నేరదు.