పుట:SamskrutaNayamulu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
311

సంస్కృతన్యాయములు

దీపమే లేనపుడు వెలుతు రిచ్చు టెక్కడ?

ఉదా:--దాహ్యవస్తువును పొందక అగ్నిమాత్రము దహింపనేఱదు. (కట్టె లంటించిననేకదా అగ్నిహోత్రము మండుట>) అట్లే--

"అప్రాప్యైవ ప్రదీపేన యది వా నిహిఅతం తమ:, ఇహస్థ: సర్వలోకస్థం స త మో నిహనిష్యతి."

న హ్యేష స్థాణో రసరాదో య దేన మందో న పశ్యతి గ్రుడ్డివాడు తన కెదురుగ నున్న స్తంభమును చూడజాలక్ మొగము కొట్టుకొనిన నది ఆ స్తంబముయొక్క తప్పిదమా?

అజ్ఞానాంధిలై పరమేశ్వరుని గుఱుతింపకున్న నయ్యది పరమేశ్వరునిలోపమా? ఈశ్వరప్రతిపాదక ప్రమాణవాక్యములపై నప్రామాణ్యబుద్దిం బలు పోకలు పోయి భ్రష్టులవు వారిదికాని.

నాగృహీతే విశేషణే విశిష్టబుద్ధి రుదేతి

విశేషణము గ్రహింపబడినయెడల విశిష్ట (విశేష్య) బుద్ధి ఉదయింపదు.

దీనిని--"అగృహీతవిశేషణా విశిష్టబుద్ధి ర్న దృష్టా; నగృహీతవిశేషణా విశిష్టబుద్ధి:; నాగృహీతవిశేషణా విశేష్యబుద్ధి:; నాజ్ఞాతవిశేషణా విశిష్టబుద్ధి ర్విశేష్యం సంక్రామతి; నాగృహీతవిశేషణన్యాయ:" ఇత్యాద్యనేక రీరుల వ్య్హవహరింతురు.