పుట:SamskrutaNayamulu.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
308

సంస్కృతన్యాయములు

న హి సామాన్యవాచీ శబ్ధో విశేషా నభివదతి

సామాన్యవాచక మైన శబ్దము విశేషములను నుడువజాలదు.

"సామాన్యనిధి రస్పష్ట" అనుదానిం జూడుము.

న హి సార్వబౌమానంద మనుభవన్ రాజా గ్రామాథిపతిసుఖం తుచ్చ మపేక్షతే

సార్వభౌమానందసుఖల్ మనుభవించు రాజు తుచ్చమైన గ్రామమునసముపదవి నపేక్షించునా?

".............................................

మృదులపాకము దిను మీవంటినరుల కరయ బూరి దినంగ సచుకునే కోర్క? యరుయగములలోన నొగి బురోడాశముల మెక్కు నిర్జరుల్ భూలోకజనుల కలనూన్నముందిన గాంక్షసేయుదురె?

కనకాసనముపైని గాంక్ష గూర్చుండు జననాధు డవనిపై జదికిలంబడునె?

మెత్తని మెత్తపై మివుల మోదమున నత్తమిల్లెడువార లస లున్నతోట జివురాకుబోంట్లతో జెలగి యేరైన బవళింప మనమున వాంచ సేయుదురై?'

వ్యాంయాతల "కవుగిలి" నుండి