పుట:SamskrutaNayamulu.pdf/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
307

సంస్కృతన్యాయములు

న హిశ్యామాకబీజం పరిక త్మసహవ్రేణాసి కలమాంకురాయకల్పతే

శ్యామాకములు అన చామలు అను నొకరకపు ధాన్యము. ఎన్నియోవేలరకముల సాధనముల్ చేసినను చామవిత్తనములనుండి చామమొలకలే బయలుదేరునుగాని వరిపైరు మొలవదు.

"న హి వటాంకుర: కుటజబీజా జ్ఞాయతే" అను దానిం జూడుము.

న హి సర్వ: సర్వం జానాతి

ప్రతివాడు సర్వము నెఱుంగడు.

"యావ త్తైలం తావ ద్వ్యాఖ్యానమ్; యావత్స్నాతా తావస్పణ్యమ్" అన్నట్లు--స్నానముచేయువార లున్న కొలది పుణ్యనద్యాదులు పుణ్యము నిచ్చుచుండుటలేతఱచి తఱచి వ్యాఖ్యానము చేయుచున్నకొలది నూతనాంశములు పొడకట్తుచునే యుండును. ఇంకను కొన్ని వానిలో మిగిలియేయుండును. లేనపుడు పొడకట్టుటయే అసంభవము. కావుననింకను సంశయములుమిగిలియుండునపుడు తనశక్తికి దగినట్లు తెలిసికొనినవాడు సర్వజ్ఞ డే కాడు.

న హి సహవ్రేణప్యన్ధై: పాటచ్చరేధ్యో గృహం రక్ష్యతే

వేయిమంది యైనను గ్రుడ్డివారు దొంగలబారినుండి గృహము రక్షింపజాలరు.