పుట:SamskrutaNayamulu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
293

సంస్కృతన్యాయములు

రాష్ట్రసౌఖ్యంబు వాంచించి గ్రామమెల్ల; దత్మువు న్నిల్ప వీడనౌ ధరణియెల్ల."

బ్రహ్మసూత్రభాష్యమున పైన్యాయ మిట్లు ప్రయోగింపబడియున్నది. చూడుడు--

"త్యజే దేకం కులస్వా ర్ధ ఇతి న్యాయా ద్భూయసీనాం బ్రహ్మలింగశ్రుతీనా మనుగ్రహా యాకాశాశ్తుతే రేకస్యా బాధ ఇత్యాహ."

దత్త మేకధా సహస్తగుణ ముపలధతే

ఒకపు డొకమా రీయబడినది ఉత్తరత్ర నేయుమడుంగులుగా పొందబడును.

పర్వసమయమున క్షేతాదులయం దొకమా రీయబడిన దానాదికము ఉత్తరజన్మమున వేయిమడుంగు లధికముగ ఫల మీ నోపునని పురాణావచనప్రసిద్ధి.

దత్తార్ణాధమర్ణ ఇవ స్వప్

ఇచ్చివేయబడిన ఋణముగల ఋణగ్రస్తునివలె నిద్రించుట. తావనితౌయొక్క దౌ:శీల్య చింతం బాసి యొకడు దత్తార్ణాధమగ్ణుని తెఱగున సుఖనిద్రం జెందెను.

దధిత్రపుసం ప్రత్యక్షో జ్వర:

సీసంపుగిన్నెలోని పెరుగు సాక్షాత్తు జ్వరమే. జ్వరకారణ మగునని భావము.