పుట:SamskrutaNayamulu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
294

సంస్కృతన్యాయములు

"అంత రేణాపి నిమిత్తశబ్ధం నిమిత్తార్థో గమ్యత్యే, ఆయుర్ఘృతం, లంగలం జీవనమ్" మున్నగునానిం జూడుము.

దుర్థురా యత్ర వక్రార న్తత్ర మౌనం హి శోధనం

కప్పలు వక్తలుగా నున్నతావున మాట్లాడక మౌనము వహించుటయే సేమము.

దవదాహస్య వేత్రబీజనాశకత్వం, రూపా న్తరజనరత్వంచ

దావాగ్ని పేముచెట్లపై బడి వాని బీజములను నసింపజేసి ఆ పేముచెట్లకు రూపాంతరము కలిగించును.

దావాగ్నిదగ్దములయిన వేత్రములనుండి రంభాంకురములు పుట్తునని లోకప్రసిద్ధి.

అట్లే - దోషములు యధార్చజ్ఞానమును నశింపజేసి, అయధార్ధజ్ఞానమును జనింపజేయును.

దూరస్థా: పర్వతా రమ్యా: సమీపస్థా స్తు బర్బరా:

దూరంపుకొండలు నునుపు; దగ్గఱకుబోయిన చెట్ట్లులు, పుట్టలును.

దూరగిరిన్యాయమును జూడుము.

దేశకాలవయోవష్ఠాబుద్ధిశర్త్యసురూపత:

ధర్మోపదేశో భైషజ్యం వక్తవ్యం ధర్మసారగై:.

ధర్మమును, వైద్యమును దేశ, కాల, వయో వస్థా, బుద్ధి, శక్తుల కనురూపముగ చెప్పవలయును.