పుట:SamskrutaNayamulu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
292

సంస్కృతన్యాయములు

తీర్ధమున కాకి నిలుకడ లేక వెంటనే వేఱొక తావున కరుగును. అట్లే గురుకులమున కేగి నులుకడ లేక వెంటనే స్వగృహమునకు తిరిగివచ్చునాతనికి "తీర్ధకాక" దృష్టాన్తము నుడువబడును.

అవప్తే నకులస్థిత న్యాయము వలె.

తై లకులుషితశాలిబీజా దజ్కు రానుదయనియమ:

నూనెలో నానిన వడ్లగింజనుండి మొలకెత్తు ట సంభవము పైపై లక్షణము లన్నియు నున్నను పుం స్తర్వహితులవు షండాదులవలన సంతాతోత్పత్తి కా నేఱదనుట లోక ప్రసిద్ధము.

త్యజే దేకం కులస్వార్ధే

ఓకదుష్టునివలన కులమున కంతకును కళంక మాపాదింపనున్నప్పుడు కులమును రక్షించుకొనిటకై అయొకనిని త్యతించివైచుట లెస్స.

"త్యజే దేకం కులస్యార్ధే, గ్రామస్యార్ధే కులం త్యకీత్ గ్రామం జపదస్యార్ధే, ఆత్మార్ధే పృధినీం త్యజిత్."

అను శ్లోకమునుంది యావాక్యము గ్రహింపబడినది.

పైశ్లోకము వ్యాఖ్యాతలనీతిశాస్త్రమున నిట్లు తెనిగింపబడియున్నది.

తే. ఉర్వివంగడమునకయి యొక్కనరుని; గొటికలెస్సకు జెచ్చెర గొలమునెల్ల;