పుట:SamskrutaNayamulu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
287

సంస్కృతన్యాయములు

నడువయసున నున్న సుందరాంగిని వదలి పశువును మోహించినట్లు.

చేతనస్య యత్నహీన స్వోర్ద్వగతి శ్చేతనా న్తరాదీనా

చేతనుండయినను యత్నహీనుని ఊర్ద్వగమనము చేతనాంతరమున నాధారపడియుండును.

"చేతనస్య యత్నహీన స్యోర్ధ్వగతి శ్చేతనాంతరాధీనేతి లౌకికన్యాయేన యత్నహీనానాం గన్తౄణాం గమయితారో ర్చిరాదయ శ్చేతనా: స్యురితి సూత్రయోజనయా బ్రూతే."

చోరాంవేషణే చోర ఏవ ప్రయోక్తవ్య;

దొంగను వెతకుటకు దొంగనే నియమించవలెను.

"వజ్రం వజ్రేణ భిద్యతే; అస్త్ర మస్త్రేణ సామ్యతి" మున్నగువానివలె.

చిద్రే ష్వసర్ఖా ఐహులీభవన్తి

కష్టములలోనే కష్టములు విశేసహ్ముగా కలుగును.

చిన్నపుచ్చశ్యదృష్టాన్త:

తోక తెగిన కుక్కపోలిక.

తోక తెగిపోయినను కుక్క కుక్కే అవునుగాని వేఱొండు గాదు.