పుట:SamskrutaNayamulu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
286

సంస్కృతన్యాయములు

గ్రావ్ణి రేఖేవ

ఱాతిమీద రేకలవలె.

శిలాక్షరములమాదిరి.

మృతవ్య పాత్ర మాదారోవా పాత్రస్య ఘృత మాదారోవా?

నేతికి గిన్నె ఆధారమా, గిన్నెకు నేయి ఆధారమా? అనితర్కించి తర్కించి యొకతిక్కతార్కికుడు తుదకు నేతిగిన్నె బోరించిచూచి నాడట.

తలతోక లెని కుతర్కముల నియ్యది సూచించును.

చటమమాంసం ధాగశతం

పిచ్చుకమాంసమును నూఱు భాగములు చేసినట్లు

చర్మతన్తౌ మహీషీం హన్తి

తోలుతిత్తికోసమై బఱ్ఱెను చంపినట్లు

చర్మము దొఱుకకపోగా బఱ్ఱె చచ్చినది

నడిసముద్రములో ప్రయాణము చేయుచు లోహము కావలసి నావికు డొకడు ఓడ బ్రద్దలుకొట్తినాడట. చూ--వృద్ధిమిష్టముతో మూలమపి తేనష్టం

నింతామణిం ప్రిత్యజ్య కదమణిగ్రహణన్యాయ:

చింతామణిం పరిత్యజ్య కాచమణిగ్రహణన్యాయ:

చింతామణిని వదలి గాజుముక్కను కొనినట్లు.

బంగారునాగలితో పొలము దున్ని జిల్లేడు మొక్కలు, అరిగలు నాటినట్లు.