పుట:SamskrutaNayamulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

సంస్కృతన్యాయములు

కదళీకంటకన్యాయము
  • ముల్లు అరటియాకుమీద బడినను, అరటియాకు ముల్లు మీద బడినను అరటియాకునకే మోసము.
కదళీకాకన్యాయము
  • కదళీవంధ్య, కాకవంధ్య.
  • ఒకమాఱుమాత్రమే ప్రసవించి మఱల గర్భములేని స్త్రీ 'కదళీవంధ్య' అనబడును.
  • కాకులు గ్రుడ్లుపెట్టుచునేయుండును. కాని కోవెల ఆ గ్రుడ్లను త్రోసివేసి తాను ఆ గూటిలో గ్రుడ్లుపెట్టును. కాకిపెట్టినగ్రుడ్లు కాకికి మాత్రము దక్కక వెంటనే నశించిపోవును. అట్లే శిశువులు పుట్టుట, వెంటనే పోవుట కల ఆడుది ' కాకవంధ్య ' అని చెప్పబడును.
కదంబముకుళన్యాయము
  • కడిమిచెట్టుపువ్వు లొకదానిలోనుండి మఱొకటి వరుసగ దండవలె నుండును.
కపోణిగుడన్యాయము
  • వంచకులు మోచేతికి బెల్లము రాచికొని మాధుర్యలోభమున జవిగొనవచ్చిన యమాయకుల నొప్పింతురు.
కమఠీదుగ్ధపానన్యాయము
  • ఆడుకప్పను గుర్తించుట కష్టసాధ్యము. దానికి సాల