పుట:SamskrutaNayamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

సంస్కృతన్యాయములు

తిత్తులు, పాలు ఉండుట అసంభవము, ఆపాలు త్రాగుట అంతకన్న అసంభవము.

కరటదంతన్యాయము
  • కాకుల దంతములను పరీక్షింప బూనుకొన్నట్లు.
  • 'కాకదంతపరీక్ష' కళా. 3. 272.
కరతలామలకన్యాయము
  • చేతిలోని యుసిరికాయవలె (స్పస్టముగ) నున్నదన్నట్లు.
కరదీపికాన్యాయము
  • తన చేతిలోని దీపము తన కుపయోగించక యితరుల కుపయోగించునట్లు.
కరబదరన్యాయము
  • చేతిలోని రేగుపండువలె (తేలికగా) నున్న దన్నట్లు.
కరభదోహనన్యాయము
  • ఆవుండగా గాడిదను పాలు పితికినట్లు.
కరికపిత్థన్యాయము
  • ఏనుగు మింగిన వెలగపండు పైకి పండువలె నున్నను లోపలిగుంజంతయు హరించును.
  • హరివంశము. పూర్వ. 3 ఆ, 123 పే.
కరిణీప్రసవన్యాయము
  • సూకరసంతానము వంతున.