పుట:SamskrutaNayamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

సంస్కృతన్యాయములు

"ఋజుమార్గేణ సిధ్యతి" అను న్యాయము
  • తేలికగానగు పనిని కష్టముచేసికొనుట.
ఏకదేశవికృతన్యాయము
  • ఒకభాగమందు వికారము గలిగినను, అది మఱియొకటి కా దనునట్లు.
ఏకనాళఫలబాహుళ్యనాయము
  • ఒకేకాడను పెక్కుపండ్లు వ్రేలునట్లు.
కంటకన్యాయము
  • ముల్లుతీసికొనుటకు ముల్లే కావలయును.
  • "ఛలం ఛలేన వంచయేత్"
కంబళభోజనన్యాయము
  • గొంగళిలో భోజనముచేయుచు వెండ్రుక లేరినట్లు.
కజ్జలజలజన్యాయము
  • కాటుకయు నీళ్లును గలిసిన నీళ్లు నల్లబడవు, కాటుక కఱగదు.
కణజమూషకన్యాయము
  • గాదెక్రింది పందికొక్కు గాదెలోనే జీవించును.
కతకరేణున్యాయము
  • చిల్లగింజ అరుగదీసి బురదనీటిలో గలిపిన ఆగంధమ నీటిని బురద నుండి వేఱుపఱచి తా నదృశ్యమవును.