పుట:SamskrutaNayamulu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
271

సంస్కృతన్యాయములు

ఇష్యమణవ్యైవ ప్రాదాన్యం న త్విచ్చాయా:

ఇష్యమాణవస్తువే ప్రధానముగాని ఇచ్చ ప్రధానముగాదు. "జ్ఞాతు మిచ్చా జిజ్ఞాసా! ఇచ్చాయా ఇష్యమాణప్రధానత్వా దిష్యమాణం జ్ఞాన మిహ విధీయతే."

తెలిసికొనవలయునను ఇచ్చ జిజ్ఞాస. ఇష్యమాణము జ్ఞానము. వీనిలో పైన్యాయమువలన విష్యమాణ విజ్ఞానమే యిట విధింపపడుచున్నది.

ఉక్తార్ధానా మప్రయోగ:

ఒకమాఱు వచింపబడినవానికి మ~అల ప్రయోగము కలుగనేఱదు.

చెప్పినదానినే చెప్పు టనవసరము.

ఉత్కృష్టదృష్టి ర్నికృష్టేబుద్యసితవ్యా

ప;ద్దచూపు విన్నదానియందును ఉందవచ్చును.

బ్రహ్మదృష్టి నాదిత్యాదులయందువలె.

"నికృష్టదృష్టి ర్నోత్కృష్టే" ప్రత్యవాయకరీ, భృత్యేతు రాజదృష్టి రభ్యుదయాయ".

అధికుండవు రాజునందు భృత్యదృష్టి అసంగరము, ప్రత్యవాయకరమును; భృత్యునియందు రాజదృష్టి శ్రేయస్కారణమే. అని పైరెండున్యాయముల అర్ధము.