పుట:SamskrutaNayamulu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
272

సంస్కృతన్యాయములు

ఉత్తీర్ణేచ జలే పారే నౌకయా కిం ప్రయోజనం,

నదిదాటి యవలియొడ్డు సేరినవెనుక నవతో నవసరమేమి?

ఉత్పతితో హి చణర: శక్త: కిం బ్రాస్ట్రకం భంక్తుమ్ ?

కాలినమంగలములో వేయబడి క్రిందికిమీదికి నెగురు శనగగింజ మంగలమును బ్రద్దలుచేయగలదా?

ఉదా:-- అల్పునిమిడిసిపాటు.

తప్తభ్రాష్ట్రతిలన్యాయమును జూడుము

ఉదరే భృతే కోకో భృస:

పొట్ట నింపుకొనిన ధనపుకొట్లు నింపుకొనినంతఫలము

ఇంతరారిద్ర్యము ననుభవించుచు--పొట్టనింపుకోగలుగుచున్నాను. అదియే చాలు. కోట్లకొలది గడంచి కోశాగారములు నింపినంత భాగ్యము.

ఉద్దేల్ప్తే ల్భవనేతు కూపఖననం ప్ర త్యుద్యమ: కీదృశ: ?

కొంప తగుల బడుచిందగా బావి త్రవ్వ ప్రయత్నించు టెటులుండును?

ఉపజీవ్యవిరోధస్యాయక్తత్వమ్

ఉపజీవ్యము అనగా కారణము (కార్యమునకు) విరుద్ధముగా నుండగూడదు.