పుట:SamskrutaNayamulu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
262

సంస్కృతన్యాయములు

అభ్యంతరాశ్చ సముగాయే పయవా:

ఒకసముగాయమున నంతర్భూతములవు పదార్ధములు తదవయములే యవును.

కావున---తత్సముదాయాభిహితార్ధము తదంతర్భూతావయములకును సంబంధించును.

ఉదా:-- రైలు పోవుచున్నది అనిన దానిచక్రములు కూడదొర్లిపోవుచున్నవి అని వేఱ చెప్పక్కరలేదుకదా!

అభ్యర్హితం పూర్వం

ప్రశస్త్మమైనది, బ్రధానమైనది, ముందు ప్రవర్తించుల్ను. అనగా, అగ్రస్థానము దానికే యీయబడును. "మాతాపితరో -తల్లిదండ్రులు" అనునట్లు.

"ప్రధానవాదస్త్యేవ ప్రాధాన్యేన నిరాసే హేత్వంతర మహ సచేతి | న కేవల మభ్యర్హితత్వాత్తస్యప్రాధాన్యం స్మృతిమూలత్వా త్తదపీత్యాహ:"

బ్రహ్మసూత్ర (ఆనందగిరి) బష్యం 1-4-28

అమ్బుని మజ్జం త్యలాబూని గ్రావాణ: ప్లవన్తే ముహ్యాన్తి నాపూంభసి శశ్వదేవ."

ఓకప్పుడు నీటిలో సొరకాయలు మునుగుచిన్నవి; తాళ్ళు తేలిపోవుచున్నవి అన్నట్లు.