పుట:SamskrutaNayamulu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
261

సంస్కృతన్యాయములు

అపవాదై రుత్సర్గా బాధ్యన్తే

సామాన్యశాస్త్రములచే అపవాదశాస్త్రములు బాధింపబడు;ను.

ఈయది వ్యాకరణపరిభాష. సామాన్యముగ చెప్పబడిన విధి (General rule) దాని కపవాదముగ అనగా భాధకముగా చెప్పబడిన మఱొకవిధి (Special rule) చే బాధింపబడు;ను.

"లబ్ధప్రతిష్ఠా: ప్రధమం కిం యూయం బలవత్తరై: అపవాదైరివూత్సర్గా: క్ర్తవ్యవృత్తయ: పరై:" కుమారసంభవము 2-`27

"య: కశ్చన రఘూణాంహి పర మేక: పరంతప:, అపవాద ఇగోత్సర్గం న్యావర్తయితు మీశ్వర:" రఘువమ్శము `5-7

అప్రాప్తే శాస్త్ర మర్ధవత్

సరియవు నర్ధము ప్రతీతము కానప్పుడును, మఱొకవిధమున నయ్యర్ధమును సాధింప నవకాశము, గతి లేనప్పుడును శాస్త్రము అర్ధవంత మవును అనగా-- తదర్ధబోధనమున శాస్త్రము ప్రఫర్తించును.

"అనిధిగతే శాస్త్ర మర్ధవత్" అనియు నీన్యాయమునకు వాడుక గలదు.