పుట:SamskrutaNayamulu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
255

సంస్కృతన్యాయములు

అత్యస్తపరాజయా ద్వరం సమ్శయో పి

పూర్తిగా పరాజయము నొందుటకంటె సమ్శయాస్పదమైన స్థితికి వచ్చుట కొంతవఱకు శ్రేయస్కరము.

ఎట్లన---

ఇరువురు శాస్త్రార్ధము చేయుచుండ నందులో నొకనికి పూర్వపక్షియొక్క పూర్వపక్షమునకు తగిన సమాధానము స్ఫురింపక నాలుక వ్రేలవేయవలసిన సమయము వచ్చినపు డతుడు నోరు మొదల్చికాని, మఱొకవెఱ్ఱిచేష్టకు దిగిగాని, పూర్తిగ నోదిపోవుటకన్న సంశయయించుచున్న స్థితిలో నాలోచన నభినయించుచు నోరెత్తకుండుటకొంతవఱకు గౌరవము నిల్పుకొని గారణ మవును.

"మరణాద్వరం వ్యాధి:; ప్రధానలోపాద్వర మంగలోప:" మున్నగు వాక్యములవలె.

ఆత్యస్ంతబలవంతో సి పౌరజానపద్ద జా:. దుర్భలై రపి బాధ్యత్తే పురుషై: పార్ధివాశ్రిత్తై:.

మిక్కిలి బలవంతు లయినను పట్టణములయందును, పల్లెలయందు నుండు జనులు రాజాశ్రయముగల దుర్బలపురుషులచే బధింపబడు చుందురు.

స్వత:సిద్ధుమగ దుర్బలు డైనను ప్రబలుడు నహాయముగ గల పురుషునిచే స్వభావముగ బలముగల పురుషుడు బాధింపబడుపట్ల నీన్యాయముపయోగింపబడును.