పుట:SamskrutaNayamulu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
254

సంస్కృతన్యాయములు

అయ్యదియే గ్రంధకరులచే నుడువబడినది--- స్వకాలే య దకుర్వం స్తత్కరో ద్య దచేతన: ప్రత్యవాయో స్తి తేనైవ నాభావేన స జన్యతే."

అచింత్యా: ఖలు యే భవా న తాం స్తర్కేణ సధయేక్ చింతింప వీలుపడని విషయములను వృధాతర్కములతో సాధింపజూచు టనవసరము.

అచేతనేష్వపి చేతనవ్యవహారో డృశ్యతే

అచేతనపదార్ధములయందును చేతనపదార్ధములందువలెనే వ్యవహారము లోకమున గంపట్టుచున్నది. "గోడ తగిలినది" అన్నట్లు. గోడకు మొగము తగులవలయునుగాని సాక్షాత్తు గొడవచ్చి మొగమునకు తగుల జాలదుగదా!

అణు రపి విశేషో ధ్యవసాయకర:

విశేషము (నాభనము) స్వల్పమయినను అయ్యరియే సంపూర్ణప్రయోజనకారి యగును.

పుష్టలగుడన్యాయమును జూడుము.

కొలది భేద మున్నను నయ్యది తత్సమమే యవును. అనగా ఒకేరకపు కొన్నివస్తువులయందు కొలదిపాటి భేదము కౌపించుచున్నను అని యన్నియు సమానములే యవును గాని భేదింపవు.