పుట:SamskrutaNayamulu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
233

సంస్కృతన్యాయములు

కావున--ఒకటి గ్రహించిన తత్సంబద్ధసముగాయమంతయు దానిచే నపకర్షింపబడు నవసరమున నీన్యాయము ప్రవర్తించునని యెఱుంగునది.

తదారితదంతన్యాయము

పైతదంతాపకర్ష న్యాయమును జూడుము.

తదాగమేహి తద్దృశ్యతేన్యాయము

ఓకదానిని చూచి తద్ద్వారా మఱొకదానిని స్మరించుట అని న్యాయముయొక్క భావము.

జాగ్రదాద్యాస్థలయందు బుద్ధివ్యాపారము సక్రమముగా నున్నపుడు దు:ఖాదులు వ్యక్తములై సుషుప్తిలో ఆబుద్ధి అడగిన దు:ఖాదులు ప్రతీయమానములు కాకుండుటయు, మఱల బుద్ధివ్యాపారము ప్రసరి8ంచిన సుషుప్తిలో సయితము సుఖదు:ఖాదులు "తదాగమేహి తద్దృశ్యతే" (అదియున్నపు డదియే చూడబడును) అను న్యాయమున బుద్ధిధర్మములే కాని ఆత్మధర్మములు కవని యెఱుంగునది.

తస్కరకందున్యాయము

దొంగ యింటిలో వంటవాడుగా నున్నట్లు. ఒకడు దొంగరనము చేసి తన దొంగరిమమును మాపుకొనుటకై దాపుననున్న ఓకధనికునివంటయింట జొచ్చెను. ఆధనికుడు వానిని దొంగగా గుర్తెంపక వంటలవాడుగా నియమించెను. వానికోసమై వెతకుచున్న రాజభటు లొక