పుట:SamskrutaNayamulu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
232

సంస్కృతన్యాయములు

".....భవతు యత్రైవమహత్యవాద ఉపలభ్యతేత్వభావేత్వౌత్సర్గికేణతత్క్రతున్యాయేనబ్రహ్మక్రతూనా మెవ తత్పాప్తి ర్నేతరేషామితి గమ్యతే,"

బ్రహ్మక్రతువే బ్రహ్మను పొందించును గాని అబ్రహ్మక్రతువు బ్రహ్మగమకము కానేరదు.

తదంతాపకీర్షన్యాయము

తదంతము అనగా అది అంతమందుగలది అని అర్ధము. (బ్రహ్మవ్రీహిసమాసము) తదంతసముదాయము నాకర్షించినట్లు అని న్యాయము.

విడదీయవీలులేని యొకవస్తుసముదాయామున్నదనుకొనుడు. వానిలో నేది కదలించినను అన్నియు గదలును. మొదలు కరలించిన చివర, చివర కరలించిన మొదలును కదలును. ఉదాహరణమునకు రైలును తీసికొనుడు. రైలుపెట్టెలలో నేనొక, లేక నడిమెభాగమును కదలించిన సముదాయము నంతయు బాప్కర్షించును.

అట్లే--అనుయాజధ్యుత్కర్ష ప్ర్రయాజాంతాపకర్షణాధికరణము నెఱుంగునది.

అనుయాజ్, ప్రయాజాదులు కొన్ని హోమవిశేషముల సముదాయము. వానికి అనుయాజాదులు మొదలు; ప్రయాజాదులు తిదియు, ఈసముదాయమున నేయొకటిగ్రహించిన నన్నియుక్రమమున వచ్చును.