పుట:SamskrutaNayamulu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
231

సంస్కృతన్యాయములు

అట్లే-- ఒకేవస్తువుతో రెండురకముల ఉపయోగములు కలిగినపుడెన్యాయము ప్రవర్తించును.

ఉదా:--"నోత్సృష్టమన్యార్ధ మపోద్యతేచ" అను వర్తిక మందు--- అన్యార్ధ మిత్ మధ్యవర్తి పదం డమరుకమణిన్యాయేనోభయత్రాపి సంబంధనీయం.

చటాదర్శికకుంతపోతన్యాయము

ఒడ్డుతెలియని పక్షిపిల్లలవలె.

సముద్రములో పడిపోయిన పక్షిపిల్ల ఒడ్దును జేరి బ్రతుకవలె నను నిచ్చతో నొకమాదిరిగ నెరిగి నలగెలంకులగలయజూచి అంతయు జలమయముగానే కనబది ఒడ్డును చూడకిఅ మఱల తా నెగిరినచోటుననే పడిపోవును. గత్యంతరాభావమున తొంటిస్థితినే ఆశ్రయించుతావున నీన్యాయ ముపయోగింపబడును.

".....ఏవం తే పి కుతీర్ధా: ప్రాగుక్తపక్షత్రయేపె వస్తుసిద్ధి మనాసాదయన్త స్తదుక్తమేవ చరుర్థం భేదాభేదపక్ష మనిచ్చయాపి కక్షీకుర్వాణా స్తచ్చాసన మేవ ప్రతి పద్యన్తామ్".

తత్ర్కతున్యాయము

తదుపద్దిష్టక్రతువు తత్ప్రతిపాదకమే అవునట్లు, తదుద్దేశవాక్యములకు తద్గ్రహణమందే తాత్పర్యము అని న్యాయభావము.