పుట:SamskrutaNayamulu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
234

సంస్కృతన్యాయములు

నాడు ఆవంటయింట బ్రవేశించి వంటపనియందు నేర్పులేక దటాబడు దొంగ ననుమానించి కొనిపోయి దొంగగా నిశ్చయించిరి. పాపము, వాడుచేసిన వంటపని వృధాప్రయాస యయ్యెను.

అట్లే-- వృధాప్రయాసకరములవు పనులయందీన్యాయము ప్రవర్తించును. ఎట్లన--

"బ్రహ్మజ్ఞానే నియ్క్తో సి తస్య కర్తుమశక్యత్వాత్తత్కుర్వస్వర్ధక్లేశభాగీ భవేత్."

తుషకండనన్యాయము

ఊకదంపినట్లు.

నిష్ప్రయోజ;నము భావము.

"అవిచరయతో యుక్తికధనం తుషకండ్నం నీచేషూపకృతం రాజన్ వాలుకాస్వివ మూత్రితమ్".

తుధాఘాతన్య్హాయమును జూడుము.

తృణభక్షణన్యాయము

గడ్డి తిన్నట్లు.

ఓకప్పుడు గడ్డికూడ పూజ్యమే అవును.

"వైరిణో పిహి ముచ్యన్తే ప్రాణాన్తేతృణభక్షణాత్, తృనాహారా: సదైతే హన్యనే పశవ: కధమ్?" ప్రాణాపాయము సంభవించినపుడు శత్రురాజు తనపగకు తలయొగ్త్గ దలచిన వెనువెంటనే గడ్డిపరక నోటిలో