పుట:SamskrutaNayamulu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
216

సంస్కృతన్యాయములు

కుక్కుటధ్వానన్యాయము

కోడికూత మొట్టమొదట స్వల్పముగ నుండి పోనుపోను దీర్ఘ,మవును.

పరాహ్ణచ్చాయాన్యాయమును జూడుము.

కుమారీకంకణన్యాయము

యువతిచేతికంకణము చాలగగులతో మొఱయుచు అటు నిటునున్న గాజులనడుమ ఒరపిడివడుచు నుండును.

"బహొనాం లలహౌ నిత్యం ద్వాభ్యాం సంఘర్షణం తధా! ఏకాకీ విచరిష్యామి కుమారీకంకణం యధా".

కులకన్యాన్యాయము

కులకాంత సిగ్గు విడువనంతదనుక కీత్రి వడయును.

"క.ధాత్రిం దృప్తిం బొదలిన ధాత్రీపరిగతి నతృప్తిదగు పాఱుడు; సాపత్రప రోచెలియటు నిరపత్రప రోచెలియుట నిరపత్రప కులాకాంత వురయు భ్రష్టత్వమ్మున్"

వాఖ్యాతల నీతిశాస్త్రము.

కులాంచక్రన్యాయము

కొంతదనుక త్రిప్పి వదలివేయబడిన కుమ్మరిచక్రము తనంత తా కొంతసేపు తిరిగి ఆగిపోవునట్లు.