పుట:SamskrutaNayamulu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
217

సంస్కృతన్యాయములు

కులాంచక్తకీటన్యాయము

కుమ్మగవానిచక్రముపై నున్న పురుగు ఆచక్రముతోబాటు వేగముగ తిరుగును. సంసారచక్రమున దేహి జననమరణాదిభ్రమణవేగమున గిర్రున తిరుగుచుండును.

కుల్యాప్రణయనన్యాయము

కాలువలు నిర్మిచినట్లు.

పోలములు బాగుగా పండుటకై కాలువలద్వారా నీటి వసతు లేర్పఱతుము. అట్లెర్పదుపబడిన కాలువలలోని నీరుత్రాగి ప్రాణధారణమును కూడ చేయుదుము. ఒకపనికై చేయబదిన కార్యము మఱొకదానికిగూడ నుపయోగించునెడ నీన్యాయము ప్రవర్తించును.

"అతో నవిధ్యేయప్రత్యయే తత్పర్యవింతి కుల్యాప్రణయనవ్యాయేనోభయార్ధత్వావిధేయాత్! యధా శాల్యర్ధం కుల్యా: ప్రణీయత్తే తాభ్య ఏవ పానీయంచ పీయతే తద్వత్:"

కుసుమస్తబకన్యాయము

పూలగుత్తి మత్తకాశినుల తలమీద నైన అలంకారముగా ప్రకాశించును; లేదా రాలి అయిన పోవును.

సజ్జనుడు ఊరిలో తలమ్మనికముగానైన ఉండును; లేదా స్వస్థానమును వదలి అడవిలో తపస్సునకైన లేచిపోవును.