పుట:SamskrutaNayamulu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
215

సంస్కృతన్యాయములు

అట్లే--ఉద్ధిష్టార్ధమును స్థిరముచేయు సిద్ధాంతమును దృడీకరించుటకై మఱికొన్ని ప్రమాణవాక్యూములను పొందుపరతురు.

కుంజరశౌచన్యాయము

గజస్నానన్యాయమును జూడుము.

కుండధారోపాస్తిన్యాయము

తనను ప్రార్ధించు భక్తునకు వరములీ దనకు శక్తి చాలనందున కుండధారుడను దేవవిసేషుడు తనకంటె అధికుడవు దేవునిచే వరము లిప్పించెనట.

సత్పురుషులు తమకు శక్తిలేకున్నచో పరులచేనైన పరోపకారము చేయింతురు.

కుంభీధాన్యన్యాయము

కుంభీ అనిన కుండ, కుంభీధాన్యుడు అనిన వ్యుత్పత్తిచేకుండలో ధాన్యము పోసుకొనువాడు అనియు, రూఢమైశ్రోత్రియుడు అనియు నర్ధములు గలవు. కుంభీధాన్యునకు గోవు నీయవలయు ననిన గౌణార్ధమవు మొదటి వానికా లేక ముఖ్యూర్దమవు శ్రోత్రియునకా అని శంక వొడమ గౌణముఖ్యములలో ముఖ్యార్ధమే గ్రహింపబడవలయునని నిశ్చయింప బడినది.

పంకజాదులవిధమున.