పుట:SamskrutaNayamulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
178

సంస్కృతన్యాయములు

సనత్కుమార: స్జోపానారోహణన్యాయేన స్థూలాదారభ్య తత్తద్భూమవ్యుత్పాతనక్రమేణ భూమాన మతిదుజ్ఞాని తయా పరమసూక్షం వ్యుత్పాదయామాస."

సోపానావరోహణన్యాయము

ఎక్కినవరుసనే మేడమెట్లొకటిగ దిగవలెను.

సౌధసోపానన్యాయము

పైసోపానారోహణ, సోపానవరోహణ న్యాయములను జూడుము.

సౌభరిన్యాయము

"సౌభరే రభివిర్మితవివిధదేహస్యాపర్యాయేణ మాన్ధాతృ కనాయభి: పంచాశతా విహార: పౌరాణికై: స్మర్యతే." పూర్వము సౌభరిమరర్షి మాంధాతృకన్యక లేబదిమందిని పెండ్లియాడి తాను నేబది సౌభరిరూపములు ధరించి వారితో విహార మొనరించియుండెను.

సర్వజ్ఞనకు ఉపాధియోగమే శూన్యము. అచ్చేద్యుడు కవున బ్రహ్మకును సంసారిత్వము ఘటింపరు. ఆయా ఉపాధుల నాశ్రయించియున్నను పరిశుద్ధబ్రహ్మతత్వమున కెట్టి బంధమోక్షములు నంటవు.

స్తనంధయన్యాయము

పాలు కుడిసి పరుండబెట్టిన శిశువు నిద్రపోవుచూ, జ్ఞాన శూన్యుడైనను మహానందంకనుభవించువానివలె నిర్విచారుడై పరుండి నిద్రాసుఖ మనుభవించును.