పుట:SamskrutaNayamulu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
177

సంస్కృతన్యాయములు

పిండి విసరు మనినట్లు. విసరినగదా పిండి యను నామము వచ్చునది! మఱి తయారయిన పిండిని విసరుట యననేమె? పిండిని విసరుము అన-తదుపకరణమవు బియ్యమో మఱొకటియో పిండిగా విసరుము అని నిర్దేశించి చెప్పుట.

సూర్యాస్తన్యాయము

సూర్యు డస్తమించిన చీకటి, చోరులు బయలు దేరుదురు.

రాజు నశించిన శత్రువులు చెలరేగుదురు.

సైంధవోదకన్యాయము

సముద్రముపునీరువలె.

సముద్రోదకము సూర్యకిరణతప్తమై ఆవిరియై మేఘముగా మాఱి వర్షించి నదులద్వారా మరల సముద్రమును జేరును.

పరమాత్మస్వరూపము అనేకరూపములొంది బ్రహ్మాండమంతయు తానుగా రూపములను ధరించి లయావసర మున తిరిగి పరమాత్మలో నైక్యమొందును.

సోపానారోహణన్యాయము

క్రమముగ ఒక్కొకటిగ మెట్లన్నియునెక్కి మేడపైకి జేరవలయును.

"ఏవం చానాత్మవిద ఆత్మానం వివిదిషో ర్నారదస్య పరమాత్మాన మేవాస్మై వ్యాఖ్యాస్యామీ త్యఃభిసన్ధిమాన్