పుట:SamskrutaNayamulu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
179

సంస్కృతన్యాయములు

ఆనందస్వరూపుండవు పరబ్రహ్మయందు మనసును లీనము చేసి కనులుమూసి బ్రహ్మానంద మనుభవించు జ్ఞాని పైకి స్థాణువువలె నున్నను లోలోన అఖండబ్రహ్మానందకరసమున తదేఅకనిష్ఠతో ఇతరవిచారములు లేక మునుకలాదు చుండును.

స్థవిరలగుడన్యాయము

ముసలివానిచే విడువ బడినకఱ్ఱ సరిగా లక్ష్యమును జేరకపోవుటయేగాక తననో చుట్టుప్రక్కలనున్నవారినో రూపుమాపును.

అసంగతవాక్యప్రయోగ మభిమతార్ధము నీయకపోగా అపార్థమునిచ్చి కొంప గూల్చును.

స్థాలీపులాకన్యాయము

"సర్యాస్తో హ్యేక: పులాక: స్థాలీ నిదర్శనాయ"

అన్నము ఉడికినదో లేదో తెలిసికొనుటకు గిన్నెలోని ఒక మెతుకు పట్తుకొని సూచిన చాలును.

"లింగ మేకత్రాపి దృశ్యమానం తుల్యన్యాయానాం సర్వేషాం ధర్మవత్తాం జ్ఞాపయతి."

ఒకానొకఉయెడ నొకమాఱు పరిదృశ్యమానమైన చిహ్నమొకటియే మిగిలినయన్నిలక్షణముల ధర్మములను తెలుపగలదు.