పుట:SamskrutaNayamulu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
176

సంస్కృతన్యాయములు

"శకుని: సూత్రబద్ద: సన్ దిక్షు వ్యాపృత్య విశ్వమం అలబ్ధ్వా బన్ధనస్థానం హస్తస్తన్బూద్యుప్రాశయేత్"

సూత్రశాటికాన్యాయము

నూలుతో వస్త్రమును నేయుమన్నట్లు.

"యత్రితు భావిసంజ్ఞయూ నిగ్దేశ:........తత్ర సూత్ర శాటికాన్యాయావతార:"

తదానంతరికసంజ్ఞచే దత్పూత్వమే నిర్ధేశము కలిగిన యవసరమున సూత్రశాటికాన్యాయము ప్ర్రవర్తించును.

"కశ్చిత్కంచి త్తస్తువాయ మాహ అస్య సూత్రస్య శాటకం వయేతి| సపశ్యతి యది శాటకో నాతవ్యూధవాతవ్యశ్చేతి విప్రతి షిద్ధమ్| భావినీ ఖల్వస్య సంజ్ఞాభిప్రేతా స మన్య్హే వాతవ్యూ యస్మిన్నుతే శాటక ఇత్యేత ద్భవతీతి."

"ఒక డొక సాలెవాని వద్ద కేగి ఈనూలుతో వస్త్రము నెసి యిమ్మనెను. ఆసాలెవాడు ఆశ్చర్యపడు;చు ఇదేమి, నూలుతో వస్త్రము నేయు మనూన్నాడు? నూలును నేసినగదా వస్త్రమవును? ఇంక వస్త్రమును నేయుట యన నేమి? నూలును నేయు మనియా? ఎట్లు నేయవలెను?" అని అనేకవిధముల నాలోచించి ఈయన తరువాతిసం జ్ఞతో వస్త్రమునే నేయుమనచున్నాడు. నేను నేయవలసినది వస్త్ర్మే--అని నిర్ధారణచేసికొనెను.