పుట:SamskrutaNayamulu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
175

సంస్కృతన్యాయములు

నుండి, రెందవుదానికిని, అందుండి మూడవదానికిని, నాలవుదానికిని సూది క్రమక్రమముగ దిగి చిల్లు చేయవలయునుగదా అట్లు ఒకదానినుండి రండవుదానికింబోవునపుడు సూది కొంత కాలము తీసుకొనును. కాని అతిసూక్ష్మవుట నయ్యది మనకు గుర్తింప సాధ్యముకాక ఒకేమాఱుగ నవన్నియు చిల్లుపడ జేయ బడినవని భ్రమింతుము.

శతపత్రపత్రశతభేదనన్యాయము జూడుము.

సూత్రబద్ధశకునిన్యాయము

ఒకపక్షికాలికి దారము గట్టి మేకునకు గట్టివైచిన నది ఎగిరిపో ప్రయత్నించి ఎగిరన జార మొంతపొడవున నుండునో అంతదూరముమాత్రము మేకునకు నలువైపులపోయి మఱల మేకుదగ్త్గఱకే రాగలుగునుగాని యింకేందును పోజాలదు.

అట్లే--మనస్సు అన్నివైపుల నన్నిదిక్కులం బడి పోయి యెఛటను నాయతనము లభింపమి మఱల మ~అలివచ్చి ప్రాణమునే ఆశ్రయించును. 'ప్రాణబద్ధనం హీసోమ్య మన ఇతి.'

మఱియుయ్--

'శకుని: సూత్రబద్ధొ య: సగచ్చంవివిధా దిశ:, అలబ్ధాధార మాకశే బస్థనస్థాన మావ్రజేత్."