పుట:SamskrutaNayamulu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
170

సంస్కృతన్యాయములు

భిక్షునిమాత్రము త్యజించివైచెను. అట్లు త్యజించివైచుటకు తనయిచ్చయే వానిని పురికొల్పినది. అట్లే---

"ప్రత్యేక పీశవచనాత్వా దుభయో: ప్రామాణ్యే పౌరుషేయత్వా న్మూలక్రమాణసాపేక్షతయా ధర్మాదౌతదభావా దప్రామాణ్యే వా ప్రాప్తే ప్యుక్తనిభాగే తార్కికేచ్చైవ నియామికే త్యర్ధమాహు:"

ప్రకృతాస్తవచనమున ప్రామాణ్యాప్రామాణ్యములు సంభవించినపుడు స్వేచ్చగా తార్కికు లొక పక్షమనలంబింతురు అనికొంద రందురు.

ఏతావతా-- విషమసంఘటనలు రెండు సంఘటించినపుడేదో పక్షమును స్వేచ్చగా నవలంబించుసందర్బమున నీన్యాయము ప్రవర్తించునని రెండవపక్షపు భావము.

సన్యాసియోషాన్యాయమును జూడుము.

సుమసౌరభన్యాయము

పూవు, తావివలె. అవినాభవసంబంధము.

శబ్దము, అర్ధము, ఉఱుము, మెరుపు; వెలుతురు; నీడ; మున్నగునవివలె.

సువర్ణన్యాయము

బంగారమును కఱగినకొలది వన్నెహెచ్చును. శాస్త్రమును తఱచినకొలది మెఱుగు వచ్చును.