పుట:SamskrutaNayamulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
171

సంస్కృతన్యాయములు

ఒకేబంగారము రకరకముల నగలుగా మాఱి అన్నిరూపములుగా కనబడును.

పరమాత్మ యొకడే బహుదేహాంతర్వర్తియై అనేకత్వమున భాసించును;.

 "మృత్పిణ్డ మేకం బహుభాణ్డరూపం
సువర్ణ మేకం బహుభూషణాని
గోక్షీర మేకం బహుధేనుజాత
మేక: పరాత్మా బహుదేహవర్తీ."

సూకరవాటికాన్యాయము

పంది పూదోటలో జొచ్చినట్లు.

"పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా"

పెంటదిని నేలక్రుళ్ళగించు పంది పూదోటలో జొచ్చిన పాదులు పెల్లగించి పూలమొక్కలను ధ్వంసముచేయుగాని సౌరభాదుల ననుభవింపదు.

సాధుసమాజమున కుత్సితుడు జేరినట్లు, సత్కులమున కులసాంసనుడు పుట్టినట్లు.

సూకరీప్రవవన్యాయము

పందిపిల్లలు పుట్టినట్టు.

తల్లికదుపుబాధయేగాని, నిష్ప్రయోజన మని భావము.

సూక్తవారన్యాయము

సూక్తవాకమును బఠించునట్లు.