పుట:SamskrutaNayamulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
150

సంస్కృతన్యాయములు

కట్టుకొనుచున్నది. దానినోటికి తాళము వేయించవలెనని తానే స్వ్యయముగ బిచ్చము లేదు పొమ్మనెనట. కోడలికి బుద్ధి చెప్పి అత్త తాను ఱంకుచేసినట్లు.

శ్వ్జసభన్యాయము

కుక్కలు సభ చేసినట్లు.

కుక్క మఱొక కుక్కను జూచిన నూరుకొనక మొఱుగును. పైబడి పోట్లాడును. అట్టియెడ పదికుక్కలొకచోచేరి నెట్లుండునో చూడుడు. నిరర్ధకమైన పోట్లాటతో ఆకుక్క లకును, ఆ అఱుపులు వినలేక ఇరుగుపొరుగువారలకును మచ్చమాయును.

కేవలవాదప్రతివారములతో చీకాకై వట్టిగల్లంతుగా మాఱిన అప్రయోజకుల కూటమి వచియించుతావుల నీన్యాయము ప్రవర్తించును.

శ్వానకరన్యాయము

"నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగుదీయు బైట కుక్కచేత భంగముపడును. స్థానబలిమికాని తనబలిమి కాదయా" వేమన

శ్వానారోహన్యాయము

"శ్వానారోహే కుత్;సౌఖ్యమ్"

గుఱ్ఱముమున్నగువానిని వదలి కుక్కమీద స్వారిచేసిన నేమిసుఖము కలుగును?