పుట:SamskrutaNayamulu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
149

సంస్కృతన్యాయములు

శ్వశుష్కాస్థిన్యాయము

కుక్క ఎముకను నాకినట్లు.

నాలుక చీరుకుపోయి రక్తము కారుచున్నను కుక్క ఎండిపోయిన యెముకను విడిచిపెట్టక నాకి కొఱకుచునేయుండును.

తనకు హానికరమైనను మూర్ఖుడు పట్టినపట్టు విదువడు.

శ్వశ్రూభిక్షాన్యాయము

కోడలు బిచ్చము పెట్టినట్లు.

కొంద ఱీన్యాయమునకును, వధూమాషమాపనన్యాయమునకును భేదము లెదందురు; మఱిమొందఱు శ్వశ్రూనిర్గచ్చోక్తిన్యాయము నియ్యదియు నొకటి యందురు.

శ్వశ్రూవిర్గచ్చోక్తిన్యాయము

"భిక్షా మటతే మానవకాయ భిక్షాం వ్రత్యాచక్షాణామాత్మన: స్నుషాం బర్తృయిత్వాశ్వశ్రూ పున స్తమాహూయ సమాగతే తస్మి న్నాస్తి భిక్షా నిర్గచ్చేతి తధైన ప్రత్యాచష్టే."

ముష్టివా డొకడు బిచ్చమునకు రాగా ఆయింటికోడలు లేదు పొమ్మనెను. అది వ్ని అత్తగారు వాగ్వర్షము కురిపించుచు వచ్చి "ఓసీ, నీదా పెత్తనము బిచ్చగానిని పొమ్మనుటకు? చూడుము నిన్నేమెచేసెదనో" అని పొట్లాడి వానిని పిలిచి ఈతొత్తు అనవసరపు పెత్తనము